• జనసేన నేతల నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే అక్రమ కేసులు
• ఇలాంటి చర్యలకు భయపడేది లేదు.. న్యాయపోరాటం చేస్తాం
• జనసేన ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్య, టి. శివశంకర్
విశాఖ ( జనస్వరం ) : రోజు రోజుకీ జనసేన పార్టీకి, పార్టీ నాయకులకు ఆధరణ పెరుగుతుందన్న అక్కసుతో పార్టీ నేతల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకే వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని పార్టీ ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్య, తమ్మిరెడ్డి శివశంకర్ లు ఆరోపించారు. విశాఖలో పులివెందుల రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన.. తదనంతర పరిణామాల నేపధ్యంలో పోలీసులు పెట్టిన కేసులు ఎ1, ఎ2గా ఉన్న వీరిద్దరు అప్పటి నుంచి అజ్నాతంలో ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపధ్యంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. నిజంగా తప్పు చేస్తే.. దోషులు ఎవరైనా సరే శిక్షించాల్సిందే. అయితే ఇలా అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడదామని చూస్తే మాత్రం ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఎన్నికల ముందు జరిగిన బాబాయ్ హత్య కేసులో అసలు నింధితులు ఎవరో ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. మంత్రి రోజాపై హత్యాయత్నం అంటూ ఎలాంటి విచారణ లేకుండా 155 మంది జనసేన శ్రేణుల మీద కేసులు పెట్టి అరెస్టు చేసేశారు. రాజకీయాల్లో మార్పు కోసం.. రాజకీయాల ప్రక్షాళణ కోసం.. పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారు. ఒక భావజాలం.. సిద్ధాంతం మీద ఆధారపడి మా పార్టీ ముందుకు వెళ్తోంది. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించి అంతర్గత సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు మార్పు కోసం రాజకీయాల్లో ప్రక్షాళణ కోసం మధ్యతరగతి అభివృద్ధి కోసం పార్టీ పెట్టారు.. సిద్ధాంతం.. భావజాలం మీద ఆధారపడి నడుతోంది. అన్ని కార్యక్రమాలు అంతర్గత సమావేశాలే..16వ తేదీ జనవాణి సమస్యలు వినే కార్యక్రమం.. కార్యక్రమాల వివరాలు పోలీసు అధికారులకు తెలియచేశాం.. స్వాగతం రూట్ మ్యాప్ తెలియపర్చాం..16వ తేదీ జనవాణి, 17వ తేదీ పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలతో పోలీసుల అనుమతి తీసుకున్నాం. 15వ తేదీ అధినేతకు భారీ ర్యాలీ రూపంలో స్వాగతం తెలపనున్న విషయాన్ని కూడా తెలియపర్చాం. జనసేన పార్టీ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న ఆధరణ చూసి తట్టుకోలేక ఆ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర చేశారు. ఒక ఐపీఎస్ అధికారి వచ్చి పవన్ కళ్యాణ్ చెయ్యి పైకి ఎత్తకూడదని, ప్రజలకు అభివాదం చేయకూడదని హుకుం జారీ చేయడమేంటి? మా అధినేతకు స్వాగతం పలికేందుకు గం. 3.26 నిమిషాలకు అంతా వీఐపీ లాంజ్ లోకి వెళ్లాం. 4 గంటలకు హత్యాయత్నం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇంతకంటే రుజువులు ఏం కావాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ప్రజల తరఫున మాట్లాడే గొంతును నొక్కాలన్న ఆలోచనతో నియంతృత్వ పోకడలతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కుట్రలో భాగంగానే విశాఖలో జనసేనకు నాయకత్వ వహిస్తున్న నేతలందర్నీ అరెస్టు చేశారు. వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే పిరికి పంద చర్య ఇది. ప్రభుత్వం, యంత్రాంగం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదు. సొంత రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారు. విలువలు లేని పాలన సాగించాలని చూస్తున్నారు. దీన్ని ప్రజలు హర్షించరు. బ్యారోకాట్లు కూడా పాలకులకు పెంపుడు కుక్కల మాదిరి వ్యవహరించరాదు. అధికార పార్టీ ఇచ్చిన లిస్టు ప్రకారం కేసులు పెట్టడమేంటి? ఇది ఆమోదయోగ్యమైన చర్య కాదు. సైద్ధాంతిక పోరాటాలు ఉండాలి తప్ప.. ఇలాంటి పద్దతులు మంచిది కాదు. గూండా రాజ్యం చలాయించాలని చూస్తే… చూస్తూ ఊరుకోమని అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ డాక్టర్ సెల్ ఛైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.