న్యూస్ ( జనస్వరం ) : JSP గ్లోబల్ టీం సభ్యులు సురేష్ వరికూటి అధ్యక్షతన వివిధ దేశాల ఎన్‌ఆర్‌ఐ జనసైనికులతో జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ జగ్గంపేట ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర గారు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వివిధ దేశాల జనసైనికులతో జూమ్ సమావేశం కావడం చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని దేశాల జనసైనికులను ఒక తాటిమీదకు తీసుకురావడానికి కృషి చేస్తున్న JSP గ్లోబల్ టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు చేశారు. ఇలా అన్ని దేశాల వారు ఐక్యమత్యంగా ఉండటం వల్ల జనసేనపార్టీ ఐక్యతను సూచిస్తుంది అన్నారు. ఆయన టీమ్ సభ్యులతో మాట్లాడుతూ ” జనం కోసం జనసేన ” కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకూ 327 వరోజు విజయవంతంగా ” జనసేన వనరక్షణ ” ద్వారా నియోజకవర్గం మొత్తం లక్షల నిమ్మ, దానిమ్మ మొక్కలు వితరణ చేశామని చెప్పారు. జనసేనపార్టీ 7 సిద్దాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రజలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇప్పటి దాకా ఎన్‌ఆర్‌ఐ, జనసైనికుల సహాయంతో ” జనసేన తోడు – నీడ ” అనే కార్యక్రమం ద్వారా 14 మంది కుటుంబాలకు ఇల్లు కట్టించామని గుర్తు చేశారు. యువతకు విజ్ఞానాన్ని అందించడానికి మొబైల్ లైబ్రరీలు ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన వాటిని అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నామని అన్నారు. ” జనం కోసం జనసేన ” కార్యక్రమం కోసం ప్రతిరోజూ గ్రామాల్లో జనసైనికుల ఇంటి వద్దే బస చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూనన్నారు. గతంలో 18 సంవత్సరాలుగా సర్పంచ్ గా చేసిన అనుభవం ఉండటం వల్ల గ్రామాల్లో పంచాయితీ అభివృద్ధి పనులను, ప్రభుత్వం చేయాల్సిన పనులను ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే వెంగయమ్మపురంలో ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలు నిగ్గు తేల్చాలని ఏడురోజులుగా నిరాహారదీక్ష చేసి ప్రభుత్వ అధికారులను కదిలించి ఆ అవినీతిపై నిగ్గు తేల్చేలా పోరాటం చేశామని గుర్తు చేశారు. అచ్యుతాపురం గ్రామం మధ్య నుండి ఐఓసిఎల్ కేంద్రానికి విద్యుత్ సరఫరా కోసం చేపట్టిన విద్యుత్ టవర్ లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నేను, నా భార్య నిరాహార దీక్ష చేయడం వల్ల, స్థానిక ప్రజలు మాకు మద్దతు తెలపడంతో ఆ సమస్యను అధికారులకు తెలియజేయడం ద్వారా సమస్యకు పరిష్కారం కోసం కృషి చేశామన్నారు. మనం నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల మన మీద ప్రజలకు నమ్మకం, భరోసా కలగడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో మనకు అండగా ఉంటారనే ఆశాభావంతో క్షేత్ర స్థాయిలో నిరంతరం పని చేస్తున్నామని అన్నారు. ఎన్నికల నెల రోజుల ముందు ప్రజల్లోకి వెళ్తే మనల్ని ఎవరూ గుర్తించరని అన్నారు. గ్రామాల్లో తిరుగుతున్నపుడు ప్రజలు చెప్పే బాధలు వర్ణనాతీతమని, వారి సమస్యలకు తదితర అధికారులకు తెలియజేసి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా వైసీపీ దౌర్జన్యాలు, ఆగడాలు, ఆకృత్యాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. వైసీపీ నాయకులను గద్దె దింపే రోజులు దగ్గర ఉన్నాయని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో రాత్రి పగలు తిరుగుతూ, అలాగే ఎన్నికల్లో ఒక బాండ్ పేపర్ మీద మాకున్న ఆస్తులను ప్రకటించి ఎమ్మెల్యే అయినా కూడా ఎలాంటి ఆస్తులు సంపాదించనని ప్రజలకు వివరిస్తానన్నారు. ఇపుడు ఎలా ప్రజల్లో ఎలా తిరుగుతున్నానో, వచ్చే ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల సమస్యలపై తిరుగుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు మన జనసేనపార్టీ తరుపున ప్రజల్ని కోరుతామని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటి దాకా మండల కమిటీలు, గ్రామ కమీటీలు వేశామని, అనధికారికంగా యూత్, స్టూడెంట్ లాంటి అనుబంధ టీంలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. వివిధ నియోజకవర్గ ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు తమ సందేహాలను పాఠంశెట్టి సూర్యచంద్ర గారిని అడగ్గా వారికి ఓపికతో సమాధానాలు ఇచ్చారు. అలాగే వారి నుండి సూచనలు, సలహాలు తీసుకొని వాటిని అమలుపరిచేలా కృషి చేస్తానన్నారు. “JSP గ్లోబల్ టీం” కోర్ టీమ్ సభ్యులు అమీర్ ఖాన్ (సౌదీ ఆరేబీయా), పాపోలు అప్పారావు, రవివర్మ (యూఏఈ), సుధాకర్ వరికూటి, లోకేశ్ పెద్దిరెడ్డి, బాలసుబ్రమణ్యం, అఖిల్ ఆవుల (జర్మనీ), డా. ప్రవీణ్ రాయల్, డా. కె నవీన్ (సౌత్ కొరియా), ప్రసన్న, శ్రీనాధ్ వట్టికూటి (యూకే), రత్నా పిల్లా (ఇండియా), ప్రవీణ్ మొగసాటి (కెన్యా), నవీన్ నవబోతు (కంబోడియా), సాంబ శివ (స్వీడన్) ల దేశాలతో పాటు ఇతర ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.