నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి అధ్యక్షతన జనసేన పార్టీ జిల్లా కార్యాలయం, శ్రీ హరి నగర్ నందు ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు మాట్లాడుతూ….. నెల్లూరులో ఎప్పుడు చూడని విధంగా దోపిడీలు, దాడులు, దౌర్జన్యాలు, హత్యలు ఎక్కువయ్యాయి. మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. నెల్లూరులో ఉండే ప్రజలంతా సంతోషంగా ఉండాలి, హుందాగా ఉండాలి అని అనుకుంటే వైసీపీ పాలన వచ్చినప్పటినుండి ఎక్కడ చూసినా క్రైమ్ పెరిగిపోయింది. నెల్లూరు లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. వైసీపీ వాళ్లకు ఓటేసిన వాళ్లంతా ఈ రోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఆడపిల్లకు రక్షణ లేదు, నిన్న మొన్న కూడా మహిళల మీద దాడులు జరిగాయి ,మానభంగాలు కూడా ఎక్కువ అయ్యాయి. ఇసుక దోపిడీలు, లిక్కర్ మాఫియా, గ్రావెల్ దోపిడీలు ఇలా చెప్పుకుంటూ పోతే నెల్లూరులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థను కూడా నాశనం చేశారు.ప్రజల్లో అటు ప్రభుత్వం మీద ఇటు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నారు. వైసీపీ వాళ్లు ప్రజావేదిక కూల్చడం దగ్గర నుండి మొన్న వైజాగ్ లో జనవాని కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారికి సృష్టించిన ఇబ్బందుల వరకు ఎన్నో అక్రమాలు,ఎన్నో అన్యాయాలు చేశారు. మొన్న వైజాగ్ లో ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా వాళ్ళే సీన్ క్రియేట్ చేసి ఒక పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలని జనవాణి అనే కార్యక్రమం పెడితే కనీసం అవి పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరకుండా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు. ఇలాంటి రాక్షస పాలనలో మనందరం బ్రతుకుతున్నామంటే చాలా బాధాకరంగా ఉంది.ముఖ్యంగా నెల్లూరు సిటీలో అనిల్ కి అసలు సిగ్గు ఉందా అని అడుగుతున్నా, నీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు. మీకు నిజంగా ధైర్యం ఉంటే , మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల మీద గౌరవం ఉంటే వాళ్ల సమస్యలు తీర్చాలని మీకు ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయండి. నిత్యవసరాల వస్తువుల ధరలు ఎందుకు పెరిగిపోయాయి, ఎటు చూసినా రోడ్లన్నీ గుంతలు అయిపోయాయి ,పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి ,అలాగే చెత్త పన్ను, నీటి పన్ను ,ఇంటి పన్ను ఆ పన్ను అని చెప్పి ప్రజల పళ్లు రాలగొడుతున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు సరిగా వేయటం లేదు ,యువకులకు ఉపాధి అవకాశాలు లేవు ,సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాటిచ్చి మాట తప్పారు, మద్యపాన నిషేధం లో మాట తప్పారు ,రైతులకు గిట్టుబాటు ధరల గురించి మాట తప్పారు, ఇలా ఎన్నికల ముందు చేసిన ఎన్నో వాగ్దానంలో మాట తప్పి ప్రజల సమస్యలను గాలికొదిలేశారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, పట్టణ అధ్యక్షుడు సుజయ్ బాబు, ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్, కృష్ణా పెన్న మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఆలియా, షబ్బీర్, కంథర్, సుజాత, అలేఖ్, హరి నెల్లూరు సిటీ కమిటీ సభ్యులు , డివిజన్ ఇన్ఛార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.