మంత్రి కొడాలి నాని గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన చంద్రగిరి నియోజకవర్గం జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారు
సంస్కృతి, సాంప్రదాయం, ఆచారాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా డిక్లరేషన్ ఎవరు ఏర్పాటు చేశారు దీనిమీద చర్చ జరగాలి అని ప్రస్తావిస్తూ, ఆంజనేయ స్వామి చేతిని బొమ్మగా అభివర్ణించిన తీరును జనసేన పార్టీ ఖండిస్తుంది. ఆచారాలను ఎవరు మొదలుపెట్టారో చర్చ జరగాలని ప్రశ్నించే మంత్రి వర్యులు నిత్యం సన్నిధానంలో జరిగే అనేక పూజ కార్యక్రమాలను ఎవరు చెబితే ఆచరిస్తున్నారో తెలుసుకోవాలి. భక్తుల మనోభావాలను కించపరుస్తూ ధర్మ కార్యాలను కూడా ప్రశ్నించే ఇలాంటి పోకడలు మానుకోవాలని డిమాండ్ చేసారు. హిందూ దేశములో పుట్టి కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడిన కొడాలి నాని గారిని వెంటనే భర్తరఫ్ చేసి, హిందువులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని కనీసం ఇన్ని దారుణాలు ఇన్ని దాడులు జరుగుతున్న కనీసం ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు స్పందించకపోవటం చాలా అపోహలకు దారి తీస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడిన మంత్రి కొడాలి నాని గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని హిదువుల తరుపున జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.