కార్వేటి నగరం ( జనస్వరం ) : మండల కేంద్రంలో జనసేన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గం ఇంచార్జి Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ, ఒక్క బటన్ తో రాష్ట్రంలో రోడ్డు వేయలేరా? సిపియస్ ను రద్దు చేయలేరా? ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వలేరా? పోలీసులకు డి ఏ డి ఏ లు ఇవ్వలేరా? ఫీజు రియంబర్స్మెంట్ చేయలేరా? విదేశీ విద్య స్కిముకి నిధులు ఇవ్వలేరా? విద్యుత్ చార్జీలు తగ్గించలేరా? 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరా? డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేరా? పోలవరం పూర్తి చేయలేరా? పోలవరం నిర్వాసితులను ఆదుకోలేరా? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు కనీసం ఒక గ్రామం నైనా ఆదర్శ గ్రామంగా చేయలేరా? సంపూర్ణ మద్య నిషేధం చేయలేరా? ప్రత్యేక హోదా తీసుకురాలేరా? మీ చిన్నాన్నను చంపిన వారిని కనిపెట్టలేరా? వారికీ ఉరిశిక్ష వేయించలేరా? చెల్లెలికి రావాల్సిన చేయాల్సిన, రావాల్సిన న్యాయం చేయలేరా? రాష్ట్రంలో జరుగుతున్న అమ్మాయిల అఘాయిత్యాలపై చర్యలు తీసుకోలేరా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ అంటే భయం మీకు అందుకే వేలమంది పోలీసులను మొహరింపచేసి మీ అసమర్ధతను చాటుకున్నారు. కేసులకు భయపడే తత్త్వం మా అధినాయకునికి లేదని, అది మా జీన్స్ లోనే లేదని ఎద్దేవా చేసారు. రోజా నీ మిడిల్ ఫింగర్ని చక్రపాణి రెడ్డికి చూపించు, అయన నీకు చుక్కలు చూపిస్తున్నారనీ, లేదా బటన్ రెడ్డికి చూపించు, నిన్ను మెచ్చుకుంటాడని, మా జనసైనికులకు చూపించకు అసలే యువత, గర్జించే సింహాలు, ఈ సారి ఎన్నికల్లో నిన్ను ఓడించడం ఖాయమని తెలిపారు. చట్టం ఎప్పుడు న్యాయం వైపు ఉంటుందని తెలియజేసారు. న్యాయస్థానం లో మా నాయకులు అరెస్టు అయిన నాయకులకు అండగా ఉండి బయటకు తీసుకొస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు శోభన్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, మండల ఉపాధ్యక్షులు విజయ్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ప్రధాన కార్యదర్శి నరేష్, టౌన్ ప్రధాన కార్యదర్శి చరణ్ రాజ్, కార్యదర్శి సూర్య, మణి, భరత్ సింహ పాల్గొన్నారు.