– పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద వాపోయిన మహిళ
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 148వ రోజున 49వ డివిజన్ ఈద్గామిట్ట డౌన్, చిన్న మసీదు సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఓ మహిళ మాట్లాడుతూ డిగ్రీ వరకు చదివిన కుమారున్ని పీజీ చదివిద్దామంటే ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ ని రద్దు చేసిందని, దీంతో కుమారున్ని చదివించే స్థోమత లేక నగరంలోని ఓ బట్టల దుకాణంలో పనికి కుదిర్చినట్టు చెప్తూ ఆవేదన చెందింది. గతంలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ ను జగన్ వచ్చాక జగనన్న వసతి దీవెన అని మార్చి ఇలాంటి తల్లిబిడ్డల నెత్తిన శాపంగా పెట్టారని కేతంరెడ్డి దుయ్యబట్టారు. కరెంట్ బిల్లులను ఇష్టప్రకారం పెంచి, బిల్లు పెరిగిందన్న కారణం కూడా చూపి రేషన్ కార్డులను ఎత్తేసిన సంఘటనలు ఉన్నాయని, రేషన్ కార్డులు ఎత్తేసి డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి చదువులు చదివే వారికి కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ ని వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మార్పులు వస్తాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.