మాడుగుల, (జనస్వరం) : మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లిలో గల ప్రభుత్వ హాస్పటల్ భవనం స్లాబ్ శిధిలావస్థకు చేరుకుందనే విషయం దేవరపల్లి జనసైనికులు ద్వారా రాయపరెడ్డి కృష్ణ తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితుల్ని, శిధిలావస్థకు చేరుకున్న స్లాబ్ పరిస్థితిని పరిశీలించి హాస్పిటల్ లో గల అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా హాస్పిటల్ స్లాబ్ బాగు చేయించి, కొత్త భవనాలు నిర్మించాలని వారిని కోరడం జరిగింది. అనంతరం ఆస్పత్రిలో ఉన్న పేషెంట్ లను పరామర్శించి వారికి వైద్యం, మందులు సకాలంలో అందుతున్నాయానే విషయాన్ని అడిగి తెలుసుకొని బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం రాయపరెడ్డి కృష్ణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంత నియోజకవర్గం సొంత మండలంలో పేద ప్రజలకు ఎంతో ముఖ్యమైన హస్పటల్ భవనం ఇంత దారుణంగా శిథిలావస్థకు చేరుకునే వరకు మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారైనా ఆలోచించండి ఇప్పటికి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలో ఉన్న మీరు కనీసం మీ బాధ్యతలు ఏ మాత్రమైనా నిర్వర్తిస్తున్నారు. మీ సొంత మండలంలో ఉన్న హాస్పటల్ ని బాగు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న మీరు ఇంక రాష్ట్ర ప్రజలకు గానీ మీ నియోజకవర్గ మిగతా మండలాల్లో ఉన్న ప్రజలకు గానీ ఏమి మేలు చేస్తారు రాజకీయంగా, ఆర్ధికంగా మీరు అభివృద్ధి చెందారు గాని, రాష్ట్రం గాని మీ నియోజకవర్గం గాని ఏమైనా అభివృద్ధి అయ్యాయా, అభివృద్ధి కోసం ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా, కనీసం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లేరు, నియోజకవర్గ రోడ్లు బాగు చేసే పరిస్థితుల్లోనూ కూడా లేరు. మిమ్మల్ని రెండుసార్లు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం కనీసం కొన్ని మంచి కార్యక్రమాలు అయినా చేపట్టండి. దయచేసి ప్రస్తుతం ఎంతో కీలకమైన మీ మండలంలో గల ప్రభుత్వ హాస్పిటల్ యొక్క భవనాలు బాగు చేయించి వీలైనంత త్వరగా కొత్త భవనాలు నిర్మించాలి అని డిమాండ్ చేశారు. మీరు నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యే అయి చేసింది ఏమీ లేదు ఇక మీ సేవలు చాలు. రానున్నది జనసేన ప్రభుత్వంఅని మాడుగుల నియోజకవర్గ అభివృద్ధి కచ్చితంగా జనసేనతోనే సాధ్యం అవుతుందని రాయపరెడ్డి కృష్ణ తెలియజేశారు.