వీరఘట్టం, (జనస్వరం) : జనసేనపార్టీ ఆధ్వర్యంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 19వ రోజు కార్యక్రమం వీరఘట్టం మండలం కె.ఇచ్చాపురం గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ నిత్యవసర సరుకులు నుండి విద్యుత్ బిల్లులు, మొదలుకుని, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ చార్జీలు వరకు అన్నింటి పైన కూడా అధిక చార్జీలు వసూలు చేసి సామాన్యుడిని దోచుకొని తింటున్నారని, పేద ప్రజలకు రేషన్ బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదని గిరిజన ప్రజలు జనసైనికులకు మొరపెట్టుకున్నారు. జనసైనికులు మత్స పుండరీకం, జనసేన జాని మాట్లాడుతూ ఉచిత గ్యాస్, మహిళా బ్యాంక్ అకౌంట్ లో రేషన్ కి బదులు 2500 నుండి 3500 రూపాయల వేస్తారు. మహిళలకు 33% రిజర్వేషన్, కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్య, పంటలకు గిట్టుబాటు ధరలు, కోల్డ్ స్టోరేజ్ గుడాములు నిర్మాణం, ఇంటి నిర్మాణానికి ఉచిత ఇసుక, జనసేనపార్టీ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనపార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దత్తి గోపాలకృష్ణ, కర్ణేన సాయి పవన్, కంటు మురళి, దూసి ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు.