●ప్రజలకు బురదనీరు ఇస్తూ మీరు ఉత్సవాలు జరుపుకుంటారా?
● ప్రభుత్వమే వందరూపాయుల లక్కీడ్రా టిక్కెట్లు పెట్టి వాలంటీర్లు ద్వారా ప్రజలకు బలవంతంగా అమ్మించటం అమానుషం
● చారిత్రక విజయనగర ఘన సంస్కృతీ చిహ్నాలకు పేర్లు మార్చి వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు పెడతారా?
● ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి మీరు ఉత్సవాలు చేసుకోండి
విజయనగరం, (జనస్వరం) : జనసేనపార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు అధికార పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం వారి కార్యాలయంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ విజయనగరంలో ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని, దీనికి జిల్లా అధికారులందరూ వత్తాసు పలుకతున్నారని దుయ్యబట్టారు. రవాణాశాఖ, జిల్లా కలక్టర్ ఆధ్వర్యంలో లక్కీడ్రా పేరుతో, వాలంటీర్లు ద్వారా ప్రజలకు బలవంతంగా టిక్కెట్లు ఆమ్మించటం అమానుషమని, ఉత్సవాల పేరుతో పాడైపోయిన రోడ్లను పెద్ద పెద్ద కన్నాలు పెట్టీ, ఫ్లెక్సీలు నిషేదమని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించినా పార్టీ ప్రచారానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా కనీసం ప్రజలకు తాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పట్టణమంతా బురదనీరు ఇచ్చి ప్రజలప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అధికారులపై మండిపడ్డారు. చారిత్రక నగరమైన విజయనగరం సంస్కృతీ అవశేషాలకు నగర అభివృద్ధి పేరుతో ఇప్పటికే మూడులాంతర్లను కూల్చివేసి తూట్లు పొడిచారని, విజయనగరం జిల్లాలో ప్రజలు అందరికీ తెలిసిన నానుడి, మహారాజ హాస్పటల్ కు రాత్రికి రాత్రే పేరుమర్చాల్సిన అవసరం ఏమొచ్చిందని,1983లో శిలాఫలకం పైన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని వుంటుందని గుర్తుచేశారు. ప్రజలందరూ ఊరుకుంటే విజయనగరం కోటకు, గంటస్థంభంకు, పెద్ద చెరువుకు, అయ్యకొనేరు గట్టుకు, సంగీత కళాశాలకు, గురజాడ అప్పారావు గృహానికి కూడా మీ వైఎస్సార్సీపీ పార్టీ నాయకుల పేర్లు పెట్టేలా ఉన్నారని, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని,ముందు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి,మీ ప్రచార వ్యాపారాలు చేసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులకు, అధికారులకు హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు వంక నరసింగరావు, పత్రి సాయి కుమార్, కళ్యాణ్ సతీష్ పాల్గొన్నారు.