పెనమలూరు, (జనస్వరం) : జనసేన కార్యకర్తల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అన్నారు. వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీని చూసి భయపడుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఆరోపించారు. పెనమలూరు మండలం గోసాల గ్రామంలో వైసీపీ నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారధిని నిలదీసినందుకు జనసేన కార్యకర్త అరుణ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. స్టేషన్ జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆమ్మిశెట్టి వాసు చేరుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన అరుణ్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనసేన నాయకులను చూస్తే వైసీపీ ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. 2024లో రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో ప్రజలే బుద్ధి చెప్తారని అయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నేతలు పులి కామేశ్వరరావు, ముప్పా రాజా, బాయిన నాగరాజు, అనిల్, పలువురు జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.