పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం సింధునగర్ గ్రామంలో గిరిజన ప్రజలను కలిసిన వీరఘట్టం జనసేనపార్టీ నాయకులు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో ద్వారా ప్రజల దగ్గరకు వెళ్ళి గ్రామంలోని ప్రధాన సమస్యలు అడిగారు. ఈ సందర్భంగా గిరిజన పెద్దలు మాట్లాడుతూ మా గ్రామానికి పంచాయతీ, సచివాలయం 15కిలోమీటర్లు దూరం, మా గ్రామానికి దగ్గరగా ఉన్న పంచాయతీ ములలంకలో విలీనం చేస్తే బాగుంటుందని, తాగునీటి సమస్య ఉంది, రేషన్ బియ్యం మాత్రమే ఇస్తున్నారు, నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉన్నాయని వాపోయారు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ రేషన్ కి బదులు మీ బ్యాంక్ అకౌంట్ లో 2500 నుండి 3500 రూపాయలు వేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రజావాణి ద్వారా సమస్యలు ప్రభుత్వం అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. జనసేన జాని మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoలో 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను పవన్ కళ్యాణ్ నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పున 30 కోట్లు రూపాయలు అందిస్తున్నారు. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దత్తి గోపాలకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కొండల్లో, కొనల్లో జీవిస్తున్న మాకు, మా ఊరి సమస్యలు గురించి తెలుసుకోడానికి వచ్చిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని సింధు నగర్ గిరిజన ప్రజలు జనసైనికులతో అన్నారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలలో జనసేన పార్టీ పట్ల అపూర్వ ఆదరణ ఉందని, ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలన బాగోలేదు అని అసహనం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరాము అన్నారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు బి.పి.నాయుడు, అన్ను రామకృష్ణ, వావిలిపల్లి నాగభూషన్, దూసి ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు.