నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 140 వ రోజున 49వ డివిజన్ సంతపేటలోని సిరి చాపల వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నేడు పర్యటించిన ప్రాంతంలో అత్యధిక శాతం సిరిచాపలు అమ్ముకునే వారు, బీడీ కార్మికులు ఉన్నారని అన్నారు. బీడీలు చుట్టే మహిళల్ని పలుకరిస్తే వెయ్యి బీడీలు చుడితే 20 రూపాయలు ఇస్తారని, రోజుకి 2వేల వరకు బీడీలు చుట్టి 40 రూపాయలు సంపాదిస్తామని చెప్పారన్నారు. రోజంతా కష్టపడినా కనీస సంపాదన లేని వారి జీవితాలు గురించి మనసు చలించిందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. కష్టపడే తత్వం ఉన్న ఇలాంటి మహిళలకు టైలరింగ్, కుట్లు, అల్లికలు వంటి వివిధ అంశాల్లో స్టైపెండ్ ఇచ్చి నేర్పించి స్వయం ఉపాధి పొందే మార్గాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎలాగో ఇటువంటి అంశాలపై చిత్తశుద్ధి లేదు కనుక, నెల్లూరు సిటీలో తాము వచ్చాక ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో మార్పులు తెస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.