రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలి : పెనుగంచిప్రోలు జనసేన , బీజేపీ పార్టీలు
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, తాజాగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల దోపిడీపై సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది. దుర్గమ్మ రధానికి సంబంధించిన వెండి సింహాలు మాయమైతే నష్టమేంటి అని, 6 లక్షల రూపాయల విలువైన వెండి సింహపు విగ్రహాలు మాయమయ్యాయి అని, ఆ 6 లక్షలతో మిద్దెలు కట్టుకుంటామా అని ప్రశ్నించారు. అంతర్వేది రధం దగ్ధం ఘటన గురించి మాట్లాడుతూ, ‘రధం తగలబడితే నష్టమేంటి అని, కోటి రూపాయల దాకా ఇన్స్యూరెన్స్ వస్తోంది కదా అని అన్నారు. ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరగ్గొట్టడం గురించి మాట్లాడితే అది బొమ్మే కదా చెయ్యి విరిగితే ఆంజనేయస్వామికి ఏమన్నా నష్టముందా అని వ్యాఖ్యానించారు. ఈ మాటలన్నింటిని హిందువుల తరుపున మేము చాలా తీవ్రంగా ఖండిస్తునామని, వెంటనే కొడాలి వెంకటేశ్వర్లు నాని హిందూ విశ్వాసాలను అగౌరవపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగ్గయ్యపేటభారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మరియు పెనుగంచిప్రోలు మండల ఇంచార్జ్ కల్లూరి శ్రీవాణి ఆధ్వర్యంలో విషయంపై పెనుగంచిప్రోలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామంలోని పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో వినతి పత్రాన్ని అందివ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగబ్రహ్మ్మ చారి శివ , గోపి, నవీన్ మొదలగు వారు పాల్గొన్నారు.