ఆత్మకూరు, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఈరోజు 21వ రోజుకు చేరుకుంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆత్మకూరు జనసేనపార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జగన్నాథరావు పేటలో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు వెంకట్రావుపల్లి, శాంతి నగరం, నర్సాపురం, జాలయ్య నగరం, ముస్తాపురం, నెల్లూరు పాలెం, పేరారెడ్డి పల్లి, బీ.సీ. కాలనీ, వీవర్స్ కాలనీ, టెంకాయ తోపు, తూర్పు వీధి, జే.ఆర్ పేట తదితర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ప్రతి ప్రాంతంలో పట్టబగులు వీరు దీపాలు వెలుగుతుండడం గమనించాము. ఈ విధంగా జరుగుతున్న అనవసరపు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని జనసేనపార్టీ ఈ సందర్భంగా అధికారులను కోరడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేనపార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేనపార్టీ నాయకులు వంశీ, చంద్ర, పవన్, తిరుమల, నాగరాజు,అనిల్, తదితరులు పాల్గొన్నారు.