● భారత మాతకు స్వేచ్ఛను ప్రసాదించిన వారిలో అగ్రగణ్యులు మహాత్మా గాంధీజీ
● మహాత్మ గాంధీజి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం
● జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్
సూళ్లూరుపేట, (జనస్వరం) : భారత మాతకు స్వేచ్ఛను ప్రసాదించిన వారిలో అగ్రగణ్యుడు జాతిపతి మహాత్మా గాంధీ అని సూళ్లూరుపేట జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పేర్కొన్నారు. పవనన్న ప్రజాబాట 51వ రోజులో భాగంగా సూళ్లూరుపేట మండల పరిధిలోని కుదిరి గ్రామంలో ఆదివారం నిర్వహించారు. జాతిపిత మహాత్మ గాంధీజీ జయంతిని పరిస్కరించుకుని ఉయ్యాల ప్రవీణ్ పార్టీ నాయకులు, యువతతో కలిసి గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ కృషితో మనుషులు రుషులవుతారు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం మహాత్మా గాంధీజీ. 19వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన నాయకులలో అగ్రభాగాన గాంధీజీ నిలిచారంటే ఆయన నమ్మిన సిద్ధాంతం.. ఆచరించిన విధానం.. స్వేచ్ఛ.. స్వాతంత్ర్యాల కోసం ఆయన చేసిన అలుపెరగని పోరాటమేనన్నారు. అలాంటి మహా నాయకుడు మన దేశంలో జన్మించడం మనందరి పుణ్యమన్నారు. ఆయన ఎంచుకున్న సహాయనిరాకరణ, సత్యాగ్రహం ఈనాటికీ ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. మహాత్ముని జయంతి రోజైన అక్టోబర్ 2ను ‘ప్రపంచ అహింసా దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందంటే గాంధీజీ ప్రపంచంపై ఎంతటి బలమైన ముద్ర వేశారో మనకు అర్ధమవుతుందన్నారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా కుదిరి గ్రామంలో పర్యటించి జనసేనపార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న జనసేన షణ్ముఖ హ్యూహాన్ని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జనసేనపార్టీని ఆధరించి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. పవనన్నతోనే రాష్ర్టం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.