నిరుపేద గిరిజన వృద్ధులకు కంటి చికిత్సకై జనసేన చేయూత

     ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న దృఢ సంకల్పంతో కొనసాగుతున్న పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమం ఈరోజు ప్రజల ఆశీస్సులతో 16వ రోజుకు చేరుకుంది. పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమంలో గతంలో గిరిజన కాలనీలో పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సుబ్బమ్మ, రమణయ్య అను గిరిజన నిరుపేద వృద్ధులను ఈరోజు స్థానిక ప్రైవేటు కంటి వైద్యశాలలో చూపించి వారికి మందులు ఇప్పించడం జరిగింది. తదుపరి పవనన్న ప్రజాబాట 16వ రోజు నెల్లూరు పాలెం ముస్లిం బజార్లో నిర్వహించి స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికై మా వంతుగా పోరాడుతామని ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, పవన్, వేణు, తిరుమల, నాగరాజు, అనీల్, భాను, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

See also  పలమనేరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరిన టీడీపీ కార్యకర్తలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి