రాజోలు, (జనస్వరం) : సామాన్యులను సైతం రాజకీయాల్లో బడుగులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ఏకైక పార్టీ జనసేన పార్టీయే. అదే కోవకు చెందిన ఒక సామాన్య పేద కుటుంబం నుంచి రాజకీయాల్లో ఎంపీటీసీ స్థాయి నుంచి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షునిగా గ్రామ, మండల ప్రజల నాయకుల ప్రోత్సాహంతో ప్రజాసేవలో నేను సైతం అని ముందుకు సాగుతున్న రాజోలు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు ఇంటిపల్లి ఆనందరాజు తన పదవి కాలం ప్రధమ సంవత్సర పూర్తి చేసుకున్న సందర్భంగా వారితో జరిపిన ముఖాముఖి చర్చలో వారి రాజకీయ సేవా ప్రస్థానం వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆనందరాజు అనే నేను నేటితో మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షునిగా పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉన్నది. ఈ నా విజయానికి కారణం అయిన చింతలపల్లి గ్రామ ప్రజలకు, పురజనులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఎంపీటీసీ గా గెలిచి, మండల ఉపాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు నా పరిధిలోని సమస్యలే కాకుండా మండల, నియోజకవర్గం సమస్యలను అధికారులకు తెలియజేస్తూ, అత్యవసర సమయాల్లో నా తోటి జనసైనికులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ, పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల సహకారంతో పార్టీ పటిష్టతకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ప్రజా సమస్యల పట్ల మండల సర్వసభ సమావేశంలో ప్రశ్నిస్తూ, ప్రజల ఆదరణ పొందుతూ ముందుకెళ్తూ ఇప్పటివరకు మండలం నిధులు తెచ్చి సిమెంట్ రోడ్లు మరియు ప్రజలు ఇబ్బంది పడకుండా తాగునీటి సమస్య కోసం గ్రామాల్లో హ్యాండ్ పంపులు వేయడం, అర్హులైన దివ్యాంగులకు డాక్టర్లతో మాట్లాడి వాళ్లకు పెన్షన్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా పలు సందర్భాల్లో డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ను కలిసి వారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్లడం, హైదరాబాద్ వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి కొన్ని సమస్యలపై వివరించడం జరిగింది. అదే విధంగా క్రియాశీల సభ్యత్వంలో గతంలో 2021 లో 150 సభ్యత్వాలు మరియు 2022 లో 208 సభ్యత్వాలు చేయటం జరిగింది. నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్న గ్రామ, మండల, నియోజక వర్గ ప్రజలకు, జనసై నికులకు అలాగే నాకు ఈ స్థానం కల్పించిన పవన్ కళ్యాణ్ కు, నా విజయానికి శ్రమించిన పార్టీలకు అతీతంగా నాతోటి నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జనసేన కార్యకర్తలకు, పార్టీ అనుబంధ శ్రేణులకు, మీడియా ప్రతినిధులకు పేరుపేరునా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు.