సోమశిల జలాశయాలు డ్యామ్ లు ఎత్తి వేయడంతో నీటమునిగిన ఇళ్ళు… సందర్శించిన జనసేన నాయకులు
నెల్లూరు సిటీ ఈద్గామిట్టలో తట్టు ప్రాంతాలన్నీ జలమయం. మనుక్రాంత్ గారి సమాచారంతో ఈద్గామిట్టకి చేరుకుని బాధితులను పరామర్శించిన జనసేన నాయకులు కిషోర్ గునుకుల గారు. ఎన్ని గేట్లు ఎత్తి వేశారు… దానివల్ల ఎంత నీరు బయటకు వస్తుంది గతంలో ఏ ప్రాంతాలు నీట మునిగాయని అవగాహన లేకుండా కేవలం అప్రమత్తంగా ఉండండి అని స్టేట్మెంట్ తో తప్పించుకున్న ప్రభుత్వం.. ముందుగానే చర్యలు తీసుకొని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇళ్లను ఖాళీ చేసి ఉంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే వారు.. నిద్రించే సమయంలో ఉన్నట్టుఉండి నీరు ఇళ్ల లోకి రావడంతో స్థానికులకు నరకయాతన పడ్డారు. సంవత్సరాలు ఎన్ని గడిచినా లోతట్టు ప్రాంతాలు పరిస్థితులు ప్రశ్నార్థకంగానే ఉంది. ఏరోజు జలాశయాల నుంచి నీళ్లు వస్తాయి ఎంత మంది ప్రాణాలు బలి అవుతియో…. ఎన్నితరాలు గడచినా ఇలాగే జీవించాల్సి వస్తుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి గురించి పట్టించుకునేవారే లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసీ ఆహారం మరియు ఇతర వసతులు ఏర్పాటు చేయాల్సిందిగా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాము అని అన్నారు. అలాగే కేవలం భోజనం పంపిణీతో సరిపెట్టుకోకుండా అందుబాటులో ఉన్న పునరావాస కేంద్రాలుగా బీఈడీ కాలేజీ, GMH హాస్పిటల్ లను ఏర్పాటు చేసి బాధితులకు వసతి కల్పించవలసినదిగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అని జనసేన నాయకులు గునుకుల కిషోర్ గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.