● ఉన్న పేర్లు మార్చడం కాదు ముందు వసతులు కల్పించండి
● పేర్లు మార్చినంత మాత్రాన వసతులు మెరుగవుతాయా
● జనసేనపార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్
సూళ్లూరుపేట, (జనస్వరం) : పెళ్లకూరు మండల పరిధిలోని రోసనూరు రాజుపాళెం గ్రామంలో గురువారం 47వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆదివారం నిర్వహించారు. పార్టీ మ్యానిఫేస్టోను, జనసేన షణ్ముఖ హ్యూహాన్ని ప్రజలకు వివరించి పార్టీకి అండగా నిలచి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని జనసేనపార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంఛార్జ్ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు. ఎన్టీర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలో కానీ, రాష్ట్రంలో కానీ వైద్య వసతులు మెరుగైపోతాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవు అనేది వాస్తవం. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకల్లేకపోవడం సిబ్బంది అందుబాటులో లేరన్నారు. కొత్త యూనివర్సిటీ లేదా కొత్తగా నిర్మించిన ఏ సంస్థకైనా వైఎస్సార్ పేరు పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని, ఎప్పటి నుంచో ఉన్న యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వవిద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదన్నారు. ఉన్నవాటి పేర్లు మార్చడం కాక వసతులు కల్పించాలన్నారు. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో కొత్త వివాదాలు సృష్టించేందుకో వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయత్నంలా ఉందన్నారు.