మదనపల్లి ( జనస్వరం ) : ప్రజల విమర్శలను నిజం చేసేందుకే రాజధాని విషయమై జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తప్పదన్నారు. స్పీడ్ క్యాపిటల్ తో సండూర్ పవర్ను మొదలుపెట్టి వేలకోట్లకు తీసుకువెళ్లారు. 75 కోట్లతో భారతీ సిమెంటు ఏర్పాటు చేసి ఇవాళ దేశంలోని అతిపెద్ద సిమెంట్ సంస్థగా చేశారు. వాటికి డబ్బులు ఎలా వచ్చాయి ? ఇండియా సిమెంట్ లాంకో సంస్థ డబ్బు పెట్టలేదా మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్ సంస్థ పెట్టలేదా ? అలాగే అమరావతి లోను పెట్టుబడులకు సంస్థలు వస్తాయి. ఎక్కడా రాజధాని నిర్మించేందుకు వందేళ్లు పట్టదు. మొత్తం ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టడం దేశంలో ఏ రాజధాని నిర్మాణంలో జరగలేదు. హైదరాబాద్ నిర్మాణంలో ప్రభుత్వం డబ్బులు పెట్టిందా ? ప్రైవేటు సంస్థల నుండి వచ్చింది కదా.. పి పి మోడల్ లో వచ్చింది కదా.. ఈ మాత్రం తెలియదా ? అమరావతిని చంపాలనుకున్నారు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలన్నదే జగన్ అంతిమ లక్ష్యం. నష్ట ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతను దృష్టి మళ్లించడానికి ప్రాంతాల మధ్య విభేదాలు పెంచడానికి జగన్ కుట్రలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ప్రకటించినప్పుడు మూడు రాజధానుల జ్ఞానం లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి వికేంద్రీకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడటం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.