– అణచివేయబడిన వర్గాలకు అండగా ఉండాలన్నదే జనసేన ధ్యేయం
– జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్
సూళ్లూరుపేట, (జనస్వరం) : దొరవారిసత్రం మండల పరిధిలోని నెలబల్లి గ్రామంలో 43వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆదివారం నిర్వహించారు. పార్టీ మ్యానిఫేస్టోను, జనసేన షణ్ముఖ హ్యూహాన్ని ప్రజలకు వివరించి పార్టీకి అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు, నాయకులకు రాజకీయంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, కక్ష సాధింపు చర్యలు, కేసులను ఎదుర్కొనేందుకు జనసేన అధినేత న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పూనుకున్నారన్నారు. ఈ క్రమంలో జనసేన లీగల్ సెల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో మంగళగిరిలో లీగల్ సెల్ ను ఏర్పాటు చేసి లీగల్ సెల్ కు అంబేడ్కర్ పేరును పెట్టడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ సంకల్పానికి అనుగుణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటయ్యిందన్నారు. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం అనే అంబేడ్కర్ మాటలు అధినేత పవన్ కళ్యాణ్ కు స్ఫూర్తినిచ్చాయని అందుకే అంబేడ్కర్ స్ఫూర్తితో పార్టీని స్ధాపించడం జరిగిందన్నారు. అణచివేయబడిన వర్గాలకు అండగా నిలబడాలి అనేదే జనసేన లక్ష్యమన్నారు.