న్యూస్ ( జనస్వరం ) : యూరప్ ఖండంలో స్థిరపడిన జన సైనికులు సమష్టిగా ఏర్పడి ఇంటికి దూరంగా… జనసేనాని ఆశయాలకు. దగ్గరా… అనే నినాదంతో ‘నా సేన కోసం… నా వంతు… రైతు భరోసా కోసం రూ. 5,55,555 లక్షలు జనసేనకు విరాళంగా అందజేయడం అభినందనీయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్న తెలుగు వారు మాతృ భూమిపై ప్రేమతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేన పార్టీకి అండగా నిలబడుతున్న ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెడతామని వెల్లడించారు. విరాళం సమకూర్చిన వారిలో రవికృష్ణ యర్రంశెట్టి, ప్రతాప రేపల్లె, రాజు గరగ, జ్యోతి దల్వాయి, ఫణి కొండా, నరేష్ మేళం ముఖ్య పాత్ర పోషించారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం అండగా నిలవాలని కోరారు.