హైదరాబాద్, (జనస్వరం) : తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ లో గల జనసేన పార్టీ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ అధ్యక్షుడు రాధారం రాజలింగం పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనాడు నవాబుల అండదండలతో మన తెలంగాణ ప్రజలను, మహిళలపై అఘాయిత్యాలు చేసిన రజాకార్ల పై పోరాడి అమరవీరులైన చాకలి ఐలమ్మ, దొడ్ల కొమరయ్య మరియు ఇతరపోరాట వీరులను శ్రుతించుకొని వారికి జోహార్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ విమోచన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలురాబోయే ఎలక్షన్ల ని దృష్టి పెట్టుకుని ఓట్లకై హడావుడి చేయడం బాధాకర విషయమని ఇకనైనా అధికారంగా ప్రకటించి రాబోయే రోజుల్లో మన తెలంగాణవిమోచన దినోత్సవాన్ని ఘనంగా చేయాలని అన్నారు. అదేవిధంగా మన జనసేన సైనికులు ప్రతి డివిజన్లో అలాగే ప్రతి గ్రామములో ఘనంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రటరీ మండలి దయాకర్, కూకట్పల్లి నియోజకవర్గం జనసేనపార్టీ డివిజన్ ప్రెసిడెంట్ కొల్లా శంకర్, వెంకటేశ్వరరావు, నాగరాజు, గ్రేటర్ హైదరాబాద్ జనసైనికులు పాల్గొన్నారు