జనసేనపార్టీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించిన “అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్”

      విజయనగరం, (జనస్వరం) : అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ పరిధిలోఉన్న అయ్యన్నపేట ఎస్సీ కాలనీలో శుక్రవారం ఉదయం వైద్యశిబిరాన్ని క్లబ్ అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) నిర్వహించారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిధులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 ఎలక్ట్ గవర్నర్ కర్రోతు సత్యం, జనసేనపార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ కాలానుగుణమైన వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో వేడి వేడి ఆహార పానీయాలు సేవిస్తూ, అహరనియమాలపట్ల జాగ్రత్తలు పాటిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. వైద్య శిబిరాన్ని నిర్వహించిన క్లబ్ సభ్యులను వారు అభినందించారు. పీ.జీ.స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో సుమారు వందమందికి తనిఖీలు నిర్వించి, అవసరమైన రోగులకు మందులను ఇచ్చి, వైద్యసేవలను వినియోగించుకున్న ఈ శిబిరానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ సుందరరావు, పి.ఆర్.ఓ. అభిషేక్, కిరణ్ సేవలందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, సభ్యులు రవి, బాబురావు, చిన్ని, అప్పారావు, ఆనంద్ పాల్గొన్నారు.

See also  నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం ఆగదు : అనపర్తి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి