అరకు ( జనస్వరం ) : అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 ఏకలవ్య పాఠశాలల్లో గెస్ట్ టీచర్ పోస్టులు ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా జనసేనపార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో శత శాతం ఉద్యోగాలను ఆదివాసులకే కేటాయించాలని కోరారు. తప్పుడు ధ్రువ పత్రాలు పొందిన బోగస్ ఎస్టీ లను గ్రామ సభల ద్వారా గుర్తించాలి. అలాంటి వారిపై సమగ్ర విచారణ జరిపి సర్టిఫికెట్ లు రద్దు చేయాలి. జీఓ నంబరు 3 రద్దు నేపథ్యంలో ఆదివాసీ ఉద్యోగాల నియామక చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఆదివాసీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఇళ్ల పట్టాల కేటాయింపును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకొని, ఏకలవ్య పాఠశాలల్లో గిరిజన అభ్యర్థులతోనే గెస్ట్ టీచర్ పోస్టు లు భర్తీ చేయాలి అని మాదాల శ్రీరాములు డిమాండ్ చేశారు.