తెలంగాణ, (జనస్వరం) : భైంసా పట్టణంలోని ఐలమ్మ గద్దె వద్ద రజక సంఘల సమితి కో కన్వీనర్ సుంకెట పోషేట్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు రాజకీయ నాయకులు జనసేనపార్టీ, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, అన్నా బాహు సాటే కమిటీ, అంబేద్కర్ సంఘం, భౌద్ధ సంఘం, యస్ సి, యస్ టి, బిసి సంఘం, యం అర్ పి యస్, ఉద్యోగ సంఘం, నిరుద్యోగ జే ఏ సి, కార్మికులు పాల్గొన్నారు. ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నినాదాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఆనాటి కాలంలో దొరల, భూస్వాముల నైజం నవాబు పరిపాలనలో ప్రజల ఆస్తులను పండించిన పంటను దౌర్జన్యంగా దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కొంగు నడుముకి చుట్టి కొడవలి చేత బట్టి వీరోచిత పోరాటం చేసి అణగారిన ప్రజలకు భూమిని పంపిణీ చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు కొనసాగాలని అన్నారు. అదేవిధంగా ప్రజలు తమ హక్కుల కోసం దైర్యంగ నిలబడి ఎవరికి భయపడకుండా ఇప్పుడున్న భారత రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణలో ట్యాంక్ బండ్ పైన ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సంత్ గాడ్గే బాబా జయంతి వర్ధంతిలను అధికారికంగా ప్రకటించి స్వచ్ భారత్ మూల పురుషుడిని గౌరవించాలని ఆయన పేరును నామ కరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకేట పోశెట్టి, దర్మాజి చంద్ర్, గిరినాత్, నామధ్కర్, దిగంబర్, గొనేకర్ శంకర్, యశ్వంత్ బాన్సొడే, అశోక్ అడ్వకేట్, గంగారాం, గౌరోల్ల దిగంబర్, అనిల్, కొత్తూరు శంకర్, సుంకెట మహేష్ బాబు, సర్పంచులు, పొషెట్టి, వినోద్, తుము రాజేశ్వర్, చౌహాన్, రఘువీర్, సుదర్శన్, లింగం, కపిల్, దండ్ల శ్రీనివాస్, రాజు, బోజన్న, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.