100 మంది రైతు కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీను గారు
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈరోజు 100మంది రైతు కూలీలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఉభయ గోదావరి జిల్లాల సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులు, తాడేపల్లిగూడెం జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీను గారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిన జనసేన పార్టీ గుర్తుకు వస్తోంది అని తెలియజేశారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 640+ ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా తమ వంతు సహాయం చేశామని అన్నారు.