కార్వేటినగరం, (జనస్వరం) : కార్వేటి నగరం మండల కేంద్రంలో ఉన్న RKSR ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 2వ తేదీ మధ్యాహ భోజనాన్ని వైసీపీ నాయకుడు బాలాజీ నాయుడు తనిఖీ చేయడాన్ని జనసేన మండల అధ్యక్షులు శోభన్ బాబు తప్పు పట్టారు. అయన మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాణ్యమైన భోజనం పెట్టాలని అడిగినందుకు కేసు నమోదు చేసిన అధికారులు, అదే నిబంధనలు బాలాజీ నాయుడుకి వర్తించే విధంగా చేయలేరా అని ప్రశ్నించారు. ఏ అధికారంతో పాఠశాలను తనిఖీ చేస్తాడో విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాలి నిలదీశారు. ప్రభుత్వ నిబంధలకు విరుద్ధంగా ఒక రాజకీయ నాయకుడు ఎలా వెళతాడు? అతనికి ఉన్న విశేష అధికారాలు ఏమిటి? మీరేమైనా అతనికి చట్ట పరమైన అనుమతి ఏమైనా ఇచ్చారా? ఎవరి అనుమతి తీసుకొని బాలాజీ నాయుడు ఆ ఉన్నత పాఠశాలకు తనిఖీకి వెళతాడు? గతంలో అనేక మార్లు రాజకీయ నాయకులు పాఠశాలలోకి వెళ్ళడానికి అనుమతి లేదని జిల్లా విద్యా శాఖాధికారి చెప్పారని, అయినా బాలాజీ నాయుడు ఈ నిబంధనలను బేఖాతరు చేసి, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు ఒక చట్టం, ప్రతిపక్ష నాయకులకు మరొక చట్టం ఏదైనా ఉందా అని అధికారులను అడిగారు. వైసీపీ నాయకుడు బాలాజీ నాయుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అనే విషయం నిరూపితమవ్వాలని డిమాండ్ చేశారు.