పెందుర్తి, (జనస్వరం) : పెందుర్తి నియోజకవర్గం 88 వార్డ్, నరవ గ్రామంలో ఎన్నో దశాబ్దాల నుంచి నివసిస్తున్న సుమారు 50 కుటుంబాల ST మన్నె దొరలతో తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని జనసేన పార్టీ తరఫున, కాలనీ ప్రజలతో వెళ్లి సచివాలయం సిబ్బందికి సమస్యల వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు గళ్ళ శ్రీనివాస మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ST మన్ని దొరలును చిన్నచూపు చూస్తుందని, వీరు చాలా దశాబ్దాల నుండి ఇక్కడ ఎస్టీ సర్టిఫికెట్స్ తో జీవనం సాగిస్తున్నారని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీ సర్టిఫికెట్ రెన్యువల్ చెయడానికి చాలా ఇబ్బంది గురిచేస్తుందని తప్పకుండా వీరందరికీ జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతామని తెలిపారు. అలాగే వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కాలనీ ప్రజలు ST సర్టిఫికెట్స్ రెన్యువల్ చేయడానికి పలుమార్లు అప్లై చేసిన అధికారులు రిజెక్ట్ చేస్తున్నారని వాపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు నిమ్మకు నిరత్తినట్లుగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. ఈ యొక్క కాలనీకి రాకపోకలు సాగించడానికి కనీసం వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయకుండా ఈ ప్రభుత్వం ST మన్ని దోరలును చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. ఇలా చూసుకుంటూ పోతే సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు వింత వింత రోగాలతో ఇబ్బంది గురవుతున్నారని, లోవెల్టేజ్ వల్ల ఇంట్లో ఉన్న గృహక పరికరాలు పాడైపోతున్నాయని, వీరికి ఎప్పటినుంచో స్మశాన వాటిక లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ విధంగా ప్రజలు సమస్యల వలయంతో బతుకుతున్న స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజు, గాని స్థానిక కార్పొరేటర్ మల్లు ముత్యాల నాయుడు గాని నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దయచేసి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఈ యొక్క కాలనీ ప్రజలకు సమస్యల నుంచి విముక్తి కలిగించేలాగా పనులు చేయాలని లేని యెడల జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేలాగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని దయచేసి అంతవరకు రానివ్వకుండా ప్రభుత్వం ఈ సమస్యలను తీర్చాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు నాయుడు, గవర శ్రీను, అప్పలరాజు, స్థానిక ప్రజలు రాజు, అర్జున్ తదితర యువకులు పాల్గొన్నారు.