● గురువులను వేదిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు
● రాష్ట్రంలో కళావీహినంగా మారిన గురుపూజోత్సవం
● ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన సంపూర్ణ మద్దతు
● జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్
సూళ్లూరుపేట, (జనస్వరం) : గురువులను వేధించిన వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారని జనసేనపార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్ ఉయ్యాల ప్రవీణ్ పేర్కొన్నారు. సోమవారం సూళ్ళూరుపేట మండల పరిధిలోని కేసీఎన్ గుంట గ్రామంలో 31వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగిన ఉయ్యాల ప్రవీణ్ ప్రజల సమస్యలను తెలుసుకుని అండగా ఉండి పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ సమాజ ఉన్నతికి ఉపాధ్యాయులే మార్గదర్శకులని అలాంటి గురువులను ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేయడం మంచి పద్దతికాదన్నారు. ఒక దేశం లేదా ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనన్నారు. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం నేడు రాష్టంలో కళావిహీనంగా మారిందన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిరంకుశ వైఖరితో వ్యవహరించడంతో పాటు అరెస్టులు చేసి జైలుకు పంపించి అక్రమకేసులు బనాయించడం, మరో వైపు యాప్‌ల పేరుతో వేధింపులకు గురిచేయడం సబబు కాదన్నారు. వేధింపులతో పాలిస్తున్న ఈ కబోది ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కళ్లు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన నిరసనతో ఐనా వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేశారు.
● గురువులందరికి పాదాభివందనం
బతుకుదారి చూపిన వారే గురువులని, సమాజంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి మార్గదర్శకులుగా గురువులు ఆదర్శనీయులన్నారు. గురువును మించిన దైవం లేదని, విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్రని గురువులందరికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలియజేశారు.