పార్వతీపురం ( జనస్వరం ) : వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ‘పవన్ కళ్యాణ్’ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. అభిమానులు, జనసైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను నడుకూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో సాయి మారుతి మందిరం లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పేరిట ప్రత్యేక పూజలను చేశారు. నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు తప్ప మరెవ్వరూ లేరని, డబ్బు రాజకీయాలను పక్కనపెట్టి, విలువలతో కూడిన రాజకీయాలను ప్రజలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన పేర్కొన్నారు. మా నడుకూరు గ్రామ జనసైనికులు చివరి శ్వాస వరకు జనసేన పార్టీ కోసమే… మా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని మత్స.పుండరీకం అన్నారు. ప్రతి జనసైనికుడు బాధ్యత గా నా సేన కోసం – నా వంతు పార్టీకి కనీసం పది రూపాయలు నుండి ఆపై ఎంత డబ్బులైన గూగుల్ పే, పేటిమ్, ఫోన్ పే ద్వారా విరాళంగా పంపిచలని, జనసేన పార్టీకి విరాళాలు వ్యక్తి గతంగా ఎవ్వరికి ఇవ్వవోద్దు అని, మీ ఫోన్ నుండి నేరుగా పంపిoచవచ్చుఅని సూచించారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం పర్యావరణ పరిరక్షణ పవన్ కళ్యాణ్ ఆశయం , దానిలో భాగంగా రైతులకు మొక్కలు పంపిణీ చేశారు. గ్రామంలో ని వృద్దులకు పళ్ళు, రొట్టెలు ఇచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతుభరోసా, జనవాణి , మేనిఫెస్టోలో ని అంశాలు గ్రామ జనసేన క్రియాశీలక సభ్యులు వివరించారు. అనంతరం కేక్ కట్ చేసి జనసేనాని కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహచలం, మత్స.వెంకటరమణ, సాధు జనార్దన్, చింత గోవర్ధన్, వాన మహేష్, రౌతు కిరణ్, సాధు విస్సు, బి.పి.నాయుడు, కంటు మురళి, మంతిని వెఘ్రిస్వరరావు, పొట్నూరు లక్ష్మి నారాయణ, మక్క.బాబ్జి , గుడివాడ రాజశేఖర్ , కంటు రాంబాబు, గెoబలి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.