పలాస ( జనస్వరం ) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పలాస నియోజకవర్గ మందస మండలం అంబుగాం గ్రామంలో జనసేన నాయకులు మధ్య శ్రీకాంత్ మరియు భాస్కరరావు గారి ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. రక్తదాన శిబిరాన్ని శ్రీకాకుళం జేమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించగా ఈ రక్తదాన శిబిరంలో 47 మంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది. జనసేన జెండాను జనసేన వీర మహిళ మజ్జి వరలక్ష్మి గారు ఆవిష్కరించడం జరిగింది.పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఎంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్య కారణం ఉద్దానం ప్రాంతంలో ఎంతోమంది కిడ్నీ మహమ్మద్ తో చనిపోవడం జరుగుతుంది, కిడ్నీ సమస్యను ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ జన్మదినం వేడుకలు ఉద్దానం ప్రాంత ప్రజలతరపున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ 2019లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విఫలమయ్యారు కానీ 2024 లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చొరవ చూపుతారని 2024లో జనసేన ప్రభుత్వం స్థాపించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తారని ప్రతి ఒక్కరు జనసేన సిద్ధాంతాలను జనసేన ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి 2024 లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడానికి తమ యొక్క సహకారాన్ని అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలాస నియోజకవర్గం జనసేన నాయకులు సంతోష్ పండ, సింహాచలం, నాగార్జున, నర్సింహామూర్తి, బాలకృష్ణ, తరకేశ్వరరావు, తరకేశ్వరరావు, కుప్పాయి గోపాల్, రాపాక కేశవరావు, శిలగాణ వాసు, రామారావు, మోహన్, సవరం శివ, మోహన్, లక్ష్మణ్, జనసేన వీర మహిళలు జనసేనకులో పాల్గొన్నారు.