అక్రమంగా హిందు దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్
జగ్గయ్యపేట నియోజకవర్గ, వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో గత రాత్రి తాళాలు ధ్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించి పవిత్రమైన నందీశ్వరుని విగ్రహాన్ని పగలగొట్టటం జరిగింది. ఈ ఘటనకి సంబంధించి ఈరోజు జనసేన బీజేపీ కలిసి దేవాలయాన్ని సందర్శించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవాలయాలపై దాడులు తాజాగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా జగ్గయ్యపేట నియోజకవర్గం లోని వత్సవాయి మండలం మక్కపేట గ్రామం లో ఈ విధమైనటువంటి దాడులను జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో ఉన్న దేవాలయాలకు ఎటువంటి భద్రత చర్యలు లేకపోవడం సీసీ కెమెరాల ఏర్పాటు వంటి కనీస సదుపాయాలు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని, ఈ విషయంపై వెంటనే సమగ్ర విచారణ జరిపి దుండగులను వెంటనే శిక్షించాలని జగ్గయ్యపేట నియోజకవర్గం జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.