తర్లీపేటలో జనసైనికుల సహాకారంతో ప్రజల దాహార్తిని తీర్చడానికి బోరు వేయించిన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్
కోటబొమ్మలి మండలం తర్లీపేట పంచాయతి నారాయణపురం గ్రామంలో ఇటీవల జనసేన అదినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా టెక్కలి జనసేన పార్టీ ఇంచార్జి కణితి కిరణ్ గారు పర్యటన లో గ్రామస్థులు త్రాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన జనసేన కణితి కిరణ్ మండల అధికారులకు సమస్య విన్నవించినా లాభంలేక పోయిందని తానే స్పందించి వెంటనే రెండు వారాల్లో మీ సమస్య తిరుస్తామని మాట ఇచ్చిన సందర్భంగా ఈ రోజు తన జనసేన ఎన్ ఆర్ ఐ మిత్రుడు లాలం ప్రసాద్, తన మేనమామల సహాయంతో హాండ్ బోర్ వేయించడం జరిగింది. ఈ సహాయం చేసి తమ ఊరి దాహార్తిని తీర్చిన జనసేన శ్రేణులకు గ్రామస్తులు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి టెక్కలి నియోజకవర్గ నాయకులు నర్సిపురం శేఖర్, రాంప్రసాద్, కోటబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పాగోటి అనిల్, ఎంపీటీసీ అభ్యర్థి పల్లి కోటి, చీపుర్లపాడు ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీపతి, సుధీర్, బగాది క్రాంతి, బర్ల చిన్న, కల్కి యాదవ్, బమ్మిడి శ్రీకాంత్, మరియు గ్రామ జనసైనికులు అంగ అప్పన్న, చిరంజీవి, జానకిరామ్, గిరి పాల్గొన్నారు.