పవన్ కళ్యాణ్ జన్మదిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన

పవన్ కళ్యాణ్

              రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య మండల కేంద్రమైన చిట్వేలు లో శు క్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు వినూత్నంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ సేవా భావంలో మేమూ సైతం అంటూ యువకులు విశేషంగా ముందుకొచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడా అభిమానులు ఆర్భాటాలకు పోవద్దని, వీలైతే జనానికి పనికొచ్చే సేవా కార్యక్రమాలు చేయాలని, ఫ్లెక్సీలు నిషేధం అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపును ఆయన అభిమానులు తు.చ తప్పకుండా పాటించారు. ఎక్కడా అటువంటి ఆర్భాటాలు లేకుండా రక్తదాన శిబిరాన్ని చేసి యువతలో ఆలోచన రేకెత్తించారు. పవన్ కళ్యాణ్ ఆకాంక్ష నెరవేరాలంటే దానికి తగ్గట్టుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకు గంటలకల్లా రక్తదాతల సంఖ్య 71దాటింది. వినాయక చవితి సందర్భంగా మండల వ్యాప్తంగా శుక్రవారం నిమజ్జన కార్యక్రమాలు. జరుగుతున్నాయి. అక్కడ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయినా విడతలవారీగా తీరిక చేసుకుని చిట్వేలి మండల వ్యాప్తంగా ఉన్న 21 గ్రామ పంచాయతీల నుంచి యువకులు రక్తదాన శిబిరానికి హాజరై వారి వంతు సహకారం అందించారు. మహిళలు కూడా స్వచ్ఛందంగా శిబిరానికి వచ్చి రక్తదానం చేశారు. చిట్వేలికి చెందిన ఏనుగుల కవిత రక్తదానం చేస్తూ యువత సేవా మార్గంలో నడిస్తే సమాజమే మారిపోతుంది అని చెప్పారు. గట్టుమీద పల్లి చెందిన సువారపు హరి కుటుంబ సభ్యులు మొత్తం రక్తదానం ప్రత్యేక ఆదర్శంగా నిలిచారు. పవన్ కళ్యాణ్ అంటే కేవలం అభిమానం మాత్రమే కాదని తమలో సేవాభావం నిండి ఉందని చాటి చెప్పడం విశేషం. మండల బిజెపి నాయకులు ఆకేపాటి వెంకట్ రెడ్డి వ్యాపార సముదాయ గదులలో ఏర్పాటుచేసిన ఈ రక్తదాన శిబిరానికి చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ ప్రణాళిక రూపొందించింది. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. మండల జనసేన నాయకులు మాదాసు నరసింహులు ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం చేశారు. జనసేన నాయకులు సుధీర్ రెడ్డి, పగడాల శివ జనసైనికులు మూడు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి చిట్వేలి ఎస్ఐ వెంకటేశ్వర్లు హాజరై రక్తదాతల ను అభినందించారు. ఈ కార్యక్రమంలో చిట్వేలి మండలం జనసేన నాయకులు మాదాసు నరసింహ కంచర్ల సుధీర్ రెడ్డి పగడాల శివ పురం సురేష్ మాదాసు శివ కావేరి అవినాష్ కడుమూరి సుబ్రమణ్యం సువారపు హరిప్రసాద్ షేక్ రియాజ్ కొనిశెట్టి చక్రి నీలి మురళీకృష్ణ పవన్ రాజు విజయ్ ఆనందుల తేజ కడుమూరి నాగరాజా మాదినేని హరి సిహెచ్ఎస్ సభ్యులు ఇంతియాజ్ శివారెడ్డి నరసింహులు షఫీ వలసని గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way