గుంతకల్ ( జనస్వరం ) : గుంతకల్ పట్టణం, అజంతా సర్కిల్ దగ్గర ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంతకల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మరియు మండల, పట్టణ అధ్యక్షులు కురువ పురుషోత్తం, బండి శేఖర్ గార్ల చేతుల మీదుగా ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పర్యావరణ హితం కోసం ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరిస్తూ వినాయక చవితి పర్వదినాన మట్టి వినాయకుల ప్రతిష్టించి పూజలు నిర్వహించి నిమజ్జనం చేయాలని దానివల్ల నీటి కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని నివారించిన వారవుతారని కావున ఈ పండుగలో మట్టి వినాయకుడినే పూజించాలని దీనివల్ల సాంప్రదాయాన్ని పాటించినవారు అవుతాం. ఈ వినాయక చవితి నుండి ప్రజలందరికీ శుభాలు కలుగజేయాలని, పాలన మాటున ప్రజల్ని పీడించే నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ విఘ్నపతిని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి గోపి, పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కసాపురం సుబ్బయ్య, నంద మైనార్టీ నాయకుడు దాదు నిస్వార్థ జనసైనికులు అనిల్ కుమార్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.