12 కుటుంబాల త్రాగునీటికి పరిష్కారం కల్పించిన వీరవల్లిపాలెం జనసైనికులు
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోని ప్రజా సమస్య పరిష్కారానికి జనసైనికులు నడుంబిగించారు. తమ సొంత సొమ్ముతో ప్రజలకు మంచినీటి వసతి కల్పించి శభాష్ అనిపించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా, అయినవిల్లిమండలంలోని వీరవల్లిపాలెం ముద్దనవారి వీధిలో ఒక దివ్యాంగురాలితో సహా 12 కుటుంబాలు నివసిస్తున్నారు. ఆ వీధిలో మంచి నీటి కుళాయి లేకపోవడం వల్ల త్రాగునీరు దొరక్క ఎంతో కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ వీధిలో నివసించే ప్రజలతో పాటు ఆ దివ్యాంగురాలు కూడా తమకు మంచినీటి వసతి కల్పించాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకున్న నాధుడు లేడు. ఈ సమస్య జనసైనికుల దృష్టికి రావడంతో పరిష్కారానికి వారు ముందుకొచ్చారు, ఆ వీధిలో చేతిపంపును ఏర్పాటు చేశారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మద్దా చంటిబాబు స్వహస్తాలతో చేతిపంపును ప్రారంభించారు. జనసైనికులను గ్రామస్తులు అభినందించారు. జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 640+ ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.