ఏలూరు, (జనస్వరం) : ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 22వ రోజు స్థానిక ఏలూరు నియోజవర్గంలో ఉన్న న్యూ ఫిష్ మార్కెట్లో ప్రారంభమైంది. వ్యాపారస్తులు అనేక రకాల ఇబ్బందులు గురి అవుతున్నారని ఇక్కడున్నా వ్యాపారస్తులు వ్యాపారం చాలా దీనస్థితిలో ఉన్నాయని ప్రభుత్వం వారిని పట్టించుకోవట్లేదు అని స్థానిక వ్యాపారస్తులు జనసేనపార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. న్యూ ఫిష్ మార్కెట్లో నిర్మాణం చేసిన దుకాణాల్లో మధ్యలో సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే వ్యాపారస్తులు బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారాన్ని సజావుగా సాగినవకుండా చేస్తున్నారని చాలా ఇబ్బందులకి గురవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. వ్యాపారస్తుల కష్టాలు తీర్చట్లేదు గానీ ఆశీల రూపంలో వాళ్ళు జేబులు గుల్ల చేస్తున్నారని చెప్పి అప్పలనాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రతిరోజు ఆశీల రూపంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు వేల వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని తెలియజేసిన కూడా పట్టించుకోకపోవడం శోచనీయమని అప్పలనాయుడు తెలియజేశారు. ఇకనైనా ఏలూరు నగర మున్సిపాలిటీ మేయర్, ఆళ్ల నాని ఈ సమస్యలుపై స్పందించాలని జనసేనపార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని హెచ్చరించారు. అనంతరం జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సుమారు 30 మంది ఇతర పార్టీల నుండి కార్యకర్తలు రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా జనసేన పార్టీ కండువాలు కప్పుకున్నారు.