రైల్వే కోడూరు ( జనస్వరం ) : ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడురు నియోజకవర్గం వైకోట గ్రామపంచాయతీ పరిధిలో ఎద్దులవారి పల్లెకు చెందిన కౌలురైతు అలం విజయ్ కుమార్ గారు వేసిన పంటలు సరిగ్గా పండక, వేసిన బోరుల్లో సరిగ్గా నీళ్ళు పడక అప్పుల పాలు అయి ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురై రెండు నెలల క్రింద పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పుల బాధతో చనిపోయిన 3,000 మంది కౌలు రైతు కుంటుంబాలకు తన కష్టార్జితం లోనుంచి లక్ష రూపాయలు ఇస్తున్న దానిని స్పూర్తిగా తీసుకొని ఆ కుంటుంబానికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో బ్రతుకు దెరువు కోసం కువైట్ కు వెళ్ళిన నందలూరు జనసైనికుడు కొట్టే.శ్రీహరి అదే మండలానికి చెందిన కువైట్ లో వున్న జనసైనికులు ఉర్లకుంట శ్రీహరి, మల్లెల హరిష్, పసుపులేటి చిన్న, పసుపులేటి లక్ష్మినారయణ, కొండమీద శివ కృష్ణ రాయల్, యెద్దల నరసింహా, పోలుబోయిన నరసింహా, వినోద్, ఆనందల మల్లి, లంకయ్యగారి సాయి, పుల్లంపేట నరేష్, అప్పన చిరంజీవి, దాసరి రామయ్య, మణి పవర్ స్టార్ దగ్గరకు తీసుకపోవడంతో వాళ్ళు స్పదించి రు.52,500 లు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బును చనిపోయిన కౌలు రైతు ఆలం విజయ్ కుమార్ గారి ఆలం లత గారికి రైల్వే కోడురు మరియు నందలూరు జనసేన నాయకులు అందివ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జోగినేని మణి, యెద్దల అనంతరాయల్, ముత్యాల కిషోర్,మాదాసు నరసింహ , సాయం శ్రీధర్, తుపాకుల పెంచలయ్య, మంకు వెంకటేశ్, గురివిగారి వాసు, యెద్దల నరసింహా, సర్దార్ బాలు, చవాకుల రెడ్డి మణి, సురవరం హరి, సవరం సాయి, శ్రీకరపు ప్రకాష్, నల్లంశెట్టి కిషోర్, మనోజ్, ఆలం నాగభూషణం, ఆలం మణి, గిరిధర్, కొండేటి లక్ష్మి నారయణ తదితరులు పాల్గొన్నారు.