అరకు, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతంలో పూర్తిస్థాయిలో నెట్ వర్క్ ఏర్పాటు చేసే వరకు పేస్ సెల్ఫీ విధానాన్ని అమలు చేయడం సరైన పద్ధతి కాదని శ్రీరాములు తెలిపారు. వెంటనే పేస్ సెల్ఫీ విధానాన్ని గిరిజన ప్రాంతంలో నిలిపివేయ్యాలని, నెట్ వర్క్ లేని చోట పేస్ సెల్ఫీ విధానాన్ని ఎలా అమలు చేశారని మండిపడ్డారు. ముందు అల్లూరి జిల్లాలో నెట్ వర్క్ సమస్య తీర్చి, మండల కేంద్రం దాటితే ఎక్కడ ఫోన్ సిగ్నల్స్ పనిచేయనప్పుడు పేస్ సెల్ఫీ విధానం ఎలా అమలు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ అమలు కోసం ఉద్యమం చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు మీద కక్ష కట్టిందని, ప్రభుత్వం కేవలం ఉపాధ్యాయలను టార్గెట్ చేసి ఇబ్బంధులు చేయడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా గిరిజన ప్రాంతపు నెట్వర్క్ సమస్య ప్రభుత్వం గుర్తించాలి. సమస్యలు పరిష్కరించండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సమయంలో ప్రభుత్వం కొత్త సమస్యను సృష్టించి ఉపాధ్యాయులను గందరగోళాన్ని చేసి ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు అమలు చేసిన పేస్ సెల్ఫీ విధానాన్ని వెంటనే నిలిపి వేయాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.