
● జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత ఈ భారత దేశంలో ఎవరికీ కూడా లేదు
● కులాల మధ్య చిచ్చు పెడుతున్నది ఎవరు?
● తిరుమలలో రోజా పర్యటనలో దర్శనానికి టికెట్లు టీటీడీ అధికారులే ఇస్తారు, మళ్ళీ వాళ్ళే ప్రశ్నిస్తారు
● రోజా పర్యాటక శాఖ మంత్రి కాదు, పర్యటన శాఖ మంత్రి
● బాల నటుడు గుడివాడ అమర్నాథ్, వృద్ధ నటుడు నారాయణస్వామి లపై ఫైర్
● పదవుల కోసం కాపు కులాన్ని వాడుకుంటాన్నారు
● కాపు పాలక మంత్రులపై జనసేన పార్టీ ఆగ్రహం
తిరుపతి, (జనస్వరం) : రాష్ట్రంలో వైసీపీ నాయకులు తుచ్చమైన, అశాశ్వతమైన పదవుల కోసం కాపు కులాన్ని వాడుకుంటూ, వైసీపీ పాలక కాపు కుల మంత్రులు కాపు కులానికి మాయని మచ్చగా మారారని, జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ నిప్పులు చెరిగారు. ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో జనసేన పార్టీ నేతలు రాజారెడ్డి, మధుబాబు, రాజమోహన్, బాబ్జి, సుమన్ బాబు, మునస్వామి, కుమార్, దిలీప్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ జనసేన పేరు వింటేనే వైసీపీ వణికిపోతున్నదని విమర్శించారు. ఈసారి ఎక్కడ జనసేన అధికారంలోకి వస్తుందేమోనన్న అనుమానం ఫ్యాన్ పార్టీలో ఉందన్నారు. పదవుల కోసం జగన్ కి కాపలా కుక్కలులా కాపు మంత్రులు మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు కాపు మంత్రులకు లేదని హెచ్చరించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏకంగా సినిమాలో బాలనటుడు భరత్ లా జగన్ దగ్గర అవార్డు పొందేందుకు జనసేన కాపులను టార్గెట్ గా చేసుకుని మాట్లాడడంపై కిరణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కులగజ్జి ఎవరిదని అన్ని కులాలు కలసి జనసైనికులుగా ఏర్పడిన పార్టీ మా జనసేన పార్టీ అని కొనియాడారు, కమ్మ జనసేన అంటూ విమర్శించడం, కమ్మ , కాపుల మధ్య చిచ్చు పెట్టే మంత్రులు అమర్నాథ్, గోరంట్ల మాధవ్ తదితర మంత్రులు రోడ్లపై కనిపిస్తే మహిళలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బ్లూ ఫిలిం, రికార్డింగ్ డాన్సులు చేయడంలో వైసీపీ మంత్రులు, నేతలకు అవార్డులు ఇవ్వవచ్చునన్నారు. తిరుమలలో రోజా పర్యటనలో దర్శనానికి టికెట్లు టీటీడీ అధికారులే ఇస్తారని, మళ్ళీ వాళ్ళే పట్టిస్తారని రోజా పర్యాటక శాఖ మంత్రి కాదు, పర్యటన శాఖ మంత్రి అని అన్నారు.