
లావేరు, (జనస్వరం) : ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, కొత్తకోట పంచాయతీలోని జనసేనపార్టీ కుటుంబ సభ్యులు రీసు, మురళి రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది. అలాగే అప్పారావు, ఆదినారాయణ, గురువమ్మ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ వారి కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని, వారికి జనసేనపార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల జనసైనికులు బార్నాల దుర్గారావు, కాకర్ల బాబాజీ, పవన్ కళ్యాణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.