నల్గొండ, (జనస్వరం) : జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జ్ మేకల సతీష్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తుంగతుర్తి నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం & క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిలు అగ్గే విజయ్, మార్గం జితేందర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతనానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు భారీ స్థాయిలో జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దుబ్బాక అశోక్ గౌడ్, G. వెంకటేష్, కొడిదల రాజు, పెరుమాండ్ల ప్రవీణ్, పోరెళ్ల ప్రవీణ్ m శోభన్, ప్రవీణ్, ఉపేందర్, శ్యామ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.