
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 90వ రోజున 51వ డివిజన్ స్థానిక ఏబీఎం కాంపౌండ్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు కావడంతో దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరం మన ఇంట్లో జెండా ఎగురవేసి దేశ సమగ్రతను, ఔనత్యాన్ని చాటుదామని తెలిపారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఇప్పటికి నిర్విరామంగా 90 రోజులు పూర్తయిందని 91వ రోజున ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవాన సైతం 51వ డివిజన్లో పర్యటిస్తున్నాం అని, ప్రతి ఇంట్లో ఎగురవేసే జెండా పండుగలో పాల్గొంటామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.