మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణము నందు గత కొన్ని రోజులుగా చెత్త చెదారం పేరుకొని తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న మార్కాపురం చెరువు కాలువ సప్లయ్ ఛానల్ ఆగిపోవడంతో దోమలకు ఆవాసంగా మారి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర విష జ్వరాలకు గురి అవుతున్నారు. ఇరిగేషన్ మరియు మున్సిపాలిటీ అధికారుల సమన్వయ లోపం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతాలలో ఆర్డిఓ కార్యాలయము, ఇరిగేషన్ కార్యాలయం ఉండటం విశేషం. దీనిపై అనేక ధర్నాలు జరిగిన పట్టించుకోని అధికార పార్టీ నాయకులు, వారి యంత్రాంగం. ఈ సమస్య పై మార్కాపురం ఆర్డీఓ లక్ష్మీ శివ జ్యోతిH దృష్టికి తీసుకువెళ్లిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. తక్షణమే ఆర్డీఓ స్పందించి తదితర అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.