కళ్యాణదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జనసేనపార్టీ నాయకుల ఆధ్వర్యంలో టమోటా రైతులు దగ్గరికి వెళ్లి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 15 వేలు హెక్టార్లో టమోటాను పండించడం జరిగింది. వేల మంది రైతులు మూడు నెలలు కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పారవేస్తూ ఉన్నారు. 2017 సంవత్సరంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి 3000 కోట్ల రూపాయలతో ధరలు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం అని, ఆహార శుద్ధి విభాగం కింద జ్యూస్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి పూర్తిగా మర్చిపోయారు. టమోటా రైతులకు కోత కోయడానికి కూలీలకు కూడా డబ్బులు చెల్లించలేక వ్యవసాయ పొలంలో అలాగే టమోటా పంటను వదిలేస్తున్నారు. ప్రభుత్వం టమోటా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో జనసేన ప్రభుత్వం రాగానే టమోటా జామ్, టమోటా కూరగాయ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా రైతులకు తెలియజేయడం జరిగింది. జై కిసాన్, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే మాటలు పేపర్ల వరకే పరిమితం అయ్యాయి. కచ్చితంగా జనసేన పార్టీ రైతులకు అండగా ఉంటుంది అని ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, జనసేన వీర మహిళా షేక్ తార, జాకీర్ వంశీ, శ్రీ హర్ష, ముక్కన్న రైతులకు తెలియజేశారు.