
కదిరి, (జనస్వరం) : కదిరి పట్టణంలో వాహనాలు పెరిగిపోవడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడి కదిరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భైరవ ప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతం, ఇందిరాగాంధీ కూడలి, జీవిమాను సర్కిల్, హిందూపురం క్రాస్, కోనేరు సర్కిల్, ఇక్బాల్ రోడ్డు, కాలేజ్ సర్కిల్ వంటి ప్రాంతంలో వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా చిన్న పిల్లలు ద్విచక్ర వాహనాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తరచూ ప్రమాదాలకు గురి అవుతున్నారు. కావున తల్లి తండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పట్టణంలో నెలకొని ఉన్న ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఒక పరిష్కార మార్గంగా ప్రధాన కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కదిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ్మిశెట్టి మధుకి కదిరి నియోజక వర్గం జనసేనపార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కాయల చలపతి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిన్నెర మహేష్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, ఐటీ వింగ్ కోర్డ్డినేటర్ పొరకల రాజేంద్ర ప్రసాద్, చక్రధర్ బాబు, సాడగల గణేష్, లోకేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.