
చిత్తూరు, (జనస్వరం) : వైకాపా నాయకులు వద్దకు వెళ్లాలంటే మహిళలు భయంతో వణికి పోతున్నారని దారం అనిత తెలిపారు. నాయకులంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ వైకాపా నాయకులు మాత్రం రేపిస్టులు, ఆకతాయిలుగా మారడం సిగ్గుచేటని మండిపడ్డారు. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళల పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరంగా ఉంది. మహిళలను వేధింపులకు గురిచేసిన మాధవ్ లాంటి నాయకులు పార్లమెంటులో ఉంటే అది సమాజానికి అవమానకరమని తెలిపారు. కనుక అతను పార్లమెంట్లో ఉండే అర్హత లేదు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకొని ఉంటే నేడు గోరంట్ల మాధవ్ అలా ప్రవర్తించేవాడు కాదని పేర్కొన్నారు. మూడేళ్లలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరుకున్నట్లు అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరగడం కాదు కదా పట్టపగలే రోడ్లపైన తిరగలేని భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఇలాంటి నేరచరిత్ర కలిగిన వారికి ముఖ్యమంత్రి టికెట్లు ఇచ్చి గెలిపించి చట్టసభలకు పంపడం సిగ్గుచేటు. దీనిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా ప్రజాప్రతినిధులు బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలపై పోరాడాలి. అలాగే సభ్య సమాజం తలదించుకునేలా న్యూడ్ వీడియో చేసిన గోరంట్ల మాధవ్ ను వెంటనే పదవి తొలగించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.