
● పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 86వ రోజున 51వ డివిజన్ రైల్వే ఫీడర్స్ రోడ్డు ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ మూడేళ్లు జలవనరుల శాఖామంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీలో దశాబ్ద కాలానికి పైగా పూర్తి కాని పెన్నా బ్యారేజీని పూర్తి చేసి ప్రారంభించలేకపోయారని, సీఎం జగన్ వచ్చి ప్రారంభిస్తారని మూడు నెలలకోసారి, పండక్కో తేదీని చెప్తూ కాలయాపన చేసారని, ఈ మాటలు వినీ వినీ నెల్లూరు ప్రజలు విసుగెత్తిపోయారని, ఇప్పుడు మరో మారు ఈ నెలాఖరు లోపు ముఖ్యమంత్రి వచ్చి పెన్నా బ్యారేజీని ప్రారంభిస్తారని కొత్త తేదీని చెప్పారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా విస్మరించి మంత్రిగా పూర్తి స్థాయిలో విఫలమైన అనిల్ ని నెల్లూరు సిటీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలందరూ జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, అది పవనన్న ప్రజాబాటలో తమకు స్పష్టంగా తెలుస్తోందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.