ఆదిలాబాద్, (జనస్వరం) : వి ఆర్ ఏ ల సమ్మె నేటికీ 17 వ రోజుకు చేరిన సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మద్దతు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని జనసేనపార్టీ తరుపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నియంత పాలన వల్లనే ముఖ్యమంత్రి దగ్గరకు కూడా వెళ్లకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు భయపడటం ఎంత దుర్మార్గం రెవెన్యూ శాఖలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వీళ్ళ పనిని ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల రెవెన్యూ అధికారులకు పనుల్లో చాలా ఆటంకాలు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం వి ఆర్ ఏ ల సమస్యలను పరిష్కరించాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.